AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏఎన్ఎన్ తెలుగు ఎఫెక్ట్: మంచానికే పరిమితమైన బాలుడి కథనానికి స్పందన.. ఆదుకుంటున్న దాతలు

  • ఏఎన్ఎన్ తెలుగు ఎఫెక్ట్
  • ఛానల్ ప్రసారం చేసిన బాలుడి దీన గాధ కథనానికి విశేష స్పందన
  • పలువురి ఆర్ధికసాయం.. సీఎం రేవంత్ రెడ్డిని కలవాలని బాలుడి కోరిక

(వరంగల్ జిల్లా ప్రతినిధి)
హన్మకొండ జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా మంచానికి పరిమితమైన ఒక బాలుడి కన్నీటి గాధను ఏఎన్ఎన్ తెలుగు ఛానల్ లో ప్రసారం కాగా, ఈ వార్తా కథనం అనేకమంది మనసులను కదిలించింది. పలువురు దాతలు ముందుకొచ్చి బాలుడి చికిత్స నిమిత్తం తోచిన సహాయం అందిస్తున్నారు.. ఆదివారం హన్మకొండ జిల్లా 54 వ డివిజన్ బీ జె పి నాయకులు పేరం గోపి కృష్ణ ఏఎన్ఎన్ తెలుగు ఛానల్ లో ప్రసారం అయిన కధనాన్ని చూసి బాలుడి ఇంటికి వద్దకు వెళ్లి బాబు యొక్క బాగోగులు, వివరాలు తల్లి తండ్రుల ను అడిగి తెలుసుకొని,ఆర్ధిక సహాయం అందించారు. అదేవిధంగా బాలుడికి సీఎం రేవంత్ రెడ్డి ని,పవన్ కళ్యణ్ నీ కలవాలని కోరిక వుంది అని చెప్పాడని, స్థానిక నాయకులు,ఎమ్మెల్యే -సీఎం రేవంత్ రెడ్డి కలిపించేలా కృషి చేయాలని కోరారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ నీ కలిపించే ప్రయత్నం చేస్తానని అని హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వం ఇలాంటి వారికి అండగా నిలవాలని, పిల్లాడి చికిత్స కోసం సహాయాన్ని అందించాలని, ఇల్లు లేక రూమ్ రెంట్లు కట్టుకుంటూ ఇబ్బందులు పడుతున్న ఈ కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, కనీసం వికలాంగుల పెన్షన్ కూడా రావడంలేదని, తక్షణమే పెన్షన్ ఇప్పించాలని అధికారులను డిమాండ్ చేశారు. మనసులను కదిలించే కథనాలు ప్రసారం చేసి బాధితులకు బాసటగా నిలవడంలో ఏఎన్ఎన్ మరోసారి తన ప్రత్యేకత చాటుకుంది.

ANN TOP 10