ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తమిళ్ యంగ్ హీరో ధ్రువ్ విక్రమ్తో తన లవ్ లైఫ్, బ్రేకప్ వార్తలపై వస్తున్న ఊహాగానాలపై ఎట్టకేలకు స్పందించింది. నెట్టింట వైరల్ అవుతున్న రూమర్లకు స్వస్తి పలుకుతూ ఆమె చేసిన ఎమోషనల్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గత ఏడాది కాలంగా తన జీవితంలో అనేక ఒడిదుడుకులు, మానసిక సంఘర్షణలు ఎదుర్కొన్నానని అనుపమ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సమయంలో అత్యంత కష్టమైన పరిస్థితులను దాటుకుని ముందుకు రావాల్సి వచ్చిందని తెలిపింది.
“గత ఏడాది నా జీవితంలో అత్యంత సంక్లిష్టమైన, కష్టతరమైన ఘట్టం నడిచింది. ఆ కష్టాలను దాటుకుని, ఇప్పుడు మళ్లీ నా జీవితంలో సంతోషం, ప్రశాంతత వైపు అడుగులు వేస్తున్నాను” అని అనుపమ పేర్కొంది. పరిస్థితులు ఎలా ఉన్నా మనల్ని మనం ప్రేమించుకోవడం, స్వీయ స్వేచ్ఛను ఎంచుకోవడం ఎంతో ముఖ్యమని చెబుతూ… అభిమానులు, శ్రేయోభిలాషులు అందించిన మద్దతుకు ధన్యవాదాలు తెలిపింది.
తమిళ యంగ్ హీరో ధ్రువ్ విక్రమ్తో ప్రేమాయణం, తదనంతర బ్రేకప్ వార్తలపై మీడియాలో రకరకాల కథనాలు షికారు చేస్తున్న నేపథ్యంలో, ఆమె పరోక్షంగా ఇచ్చిన ఈ స్పష్టతతో ఆ పుకార్లన్నింటికీ తెరపడినట్లయింది.








