AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అందం అంతా చీరలోనే..



శారీలో హాట్‌ యాంగిల్స్‌ తో రచ్చ చేసింది అనసూయ. ఈ ఫొటోలను తన ఇన్స్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేయడంతో సోషల్‌ మీడియా షేక్‌ అవుతోంది. అనసూయ షేర్‌ చేసిన ఈ ఫొటోల్లో ఆమె గ్లామర్‌ యాంగిల్స్‌ హైలైట్‌ అవుతున్నాయి. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌ ధరించి కొంటె చూపులతో కవ్విస్తోంది ఈ జబర్దస్త్‌ భామ. అందం అంతా చీరలోనే ఉన్నదని చెప్పకనే చెబుతోంది బ్యూటీ. ఇదిలా ఉంటే అనసూయ గ్లామర్‌ చూసి మైమరచిపోతున్నారు నెటిజన్లు. మతి పోగొట్టే ఆ పరువాలు చూసి కామెంట్ల వరద పారిస్తున్నారు.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉండటం, తన గ్లామర్‌ తో ఒక రేంజ్‌ లో రచ్చ చేయడం అనసూయ హ్యాబీ. ఎప్పటికప్పుడు సరికొత్తగా రెడీ అయి నెటిజన్లకు మంచి ట్రీట్‌ ఇచ్చే అనసూయ.. ఈ సారి శారీ కట్టి నెటిజన్ల మనసు దోచేసింది.

రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా చేసి సూపర్‌ రెస్పాన్స్‌ అందుకున్న అనసూయ.. అల్లు అర్జున్‌ పుష్పలో దాక్షాయణిగా చేసి ఆకట్టుకుంది. సుకుమార్‌ డిజైన్‌ చేసిన ఆమె పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ప్రస్తుతం అదే సుకుమార్‌ డైరెక్షన్‌ లో పుష్ప 2 సినిమా చేస్తోంది అనసూయ. ఈ పాన్‌ ఇండియా సినిమాలో అనసూయ రోల్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌ కానుందట. ఈ సినిమాలో అనసూయ ఐటెం సాంగ్‌ కూడా ఉంటుందని తెలుస్తోంది.

ANN TOP 10