AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ రాష్ట్ర సీఎస్ కార్యాలయానికి అరుదైన ఆఫ్రికన్ గ్రే చిలుక..

తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అనుకోని ‘అరుదైన’ అతిథి విచ్చేశారు! ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు కార్యాలయంలో అరుదైన జాతికి చెందిన చిలుక ఒకటి ప్రత్యక్షమైంది. ఆయన ఛాంబర్‌‍లోకి ఒక్కసారిగా ప్రవేశించిన ఆ చిలుక నేరుగా ఒక డెస్క్‌పై వాలింది.

 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి వచ్చిన ఆ అరుదైన చిలుకకు సిబ్బంది కొంతసేపు విశ్రాంతినిచ్చారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అటవీ శాఖ సిబ్బంది సచివాలయానికి చేరుకుని, అది ఆఫ్రికన్ గ్రే చిలుక అని నిర్ధారించారు. ఆ పక్షిని వారు తమ వెంట తీసుకువెళ్లారు

ANN TOP 10