AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం రేవంత్ ను  కలిసిన కేఎస్ఆర్.. ఆదిలాబాద్ రాజకీయాలు, అభివృద్ధిపై కీలక చర్చ..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజ కవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి సోమవారం కలిశారు. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో మూడుగంట లకుపైగా ఆదిలాబాద్ రాజకీయాలు, అభివృద్ధిపై కీలక చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీయం సలహాదా రు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి సీతక్కతో కలిసి ఆదిలాబాద్ కు సంబంధించి కీలక అంశాలపై చర్చించారు. ఆదిలాబాద్ కు సంబంధించిన అభివృద్ధి పనులు, భవిష్యత్ రాజకీయకార్యాచరణపైనా చర్చ జరిగింది.

ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అందిన ఆహ్వానం మేరకు సోమవారం హుటాహుటిన ఆదిలాబాద్ నుండి హైదరాబా ద్ వచ్చిన కంది శ్రీనివాసరెడ్డి సీఎంను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం రేవంత్ రెడ్డి కంది శ్రీనివాసరెడ్డిని ఆత్మీయంగా పలక రించడంతోపాటు పలు విషయాలపై దిశానిర్దేశం చేశారు. పార్టీని బలోపేతం చేయడంపై అభినందించారు. ఆదిలాబాద్ లో పార్టీ ప్రగ తికి పునరంకితం కావడం పట్ల ప్రశంసించా రు. సీఎంతో భేటీ నేపథ్యంలో కంది శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ జనవరిలో ఆదిలాబాద్ కు సంబంధించి అనేక శుభవార్తలు ముఖ్యమం త్రి ద్వారా వింటారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే ఆదిలాబాద్ అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని, సీఎం ముఖ్య సలహాదా రు వేం నరేందర్ రెడ్డిని కలిసి అనేక ముఖ్యమైన అంశాలు చర్చించడం జరిగిందన్నారు. ముఖ్య మంత్రి ఆశీస్సులతో ఆదిలాబాద్ ను ముందువ రుసలో నిలుపుతామన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10