AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేటీఆర్‌.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతావ్‌.. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఫైర్‌

డ్రగ్స్‌ వ్యాపారంలో కేటీఆర్‌ బామ్మర్ది

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఫైర్‌ అయ్యారు. జన్‌వాడ ఫాంహౌస్‌లో జరిగిన రేవ్‌పార్టీలో కేటీఆర్‌ బామ్మర్ది అడ్డంగా దొరికాడని అన్నారు. జన్వాడ ఫామ్‌ హౌస్‌లో జరుగుతున్న రేవ్‌ పార్టీని నార్సింగ్‌ పోలీసులు, సైబర్‌ ఎస్‌ఓటీ పోలీసులు శనివారం రాత్రి భగ్నం చేశారు. అయితే, రేవ్‌ పార్టీని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ (ఓఖీఖ) బావమరిది రాజ్‌ పాకాల ఆధ్వర్యంలో నిర్వహించినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహరంపై తాజాగా, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్‌పై మండిపడ్డారు. డ్రగ్స్‌ కల్చర్‌కు తాను పూర్తిగా వ్యతిరేకమంటూ గతంలో కేటీఆర్‌ కల్లబొల్లి మాటలు చెప్పారని ఆయన ఫైర్‌ అయ్యారు. నేడు జన్వాడ ఫామ్స్‌లో జరిగిన రేవ్‌ పార్టీపై కేటీఆర్‌ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

కేటీఆర్‌ బామ్మర్దిది డ్రగ్స్‌ వ్యాపారం..
కేటీఆర్‌ సొంత బావమరది డ్రగ్స్‌ వ్యాపారంలో ఉన్నారంటూ ఆది శ్రీనివాస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్‌ పాకాల ఇప్పటి వరకు ఎంతో మందికి డ్రగ్స్‌ అలవాటు చేసి వాళ్ల జీవితాలు, కుటుంబాలను చిన్నాభిన్నం చేశారని ధ్వజమెత్తారు. పోలీసులు ఈ కేసులో సమగ్ర విచారణను చేపట్టి.. రేవ్‌ పార్టీకి హాజరైన వారందరినీ అరెస్ట్‌ చేయాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ విజ్ఞప్తి చేశారు.

ANN TOP 10