AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సత్తుపల్లిలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు స్పాట్‌ డెడ్‌

(అమ్మన్యూస్, ఖమ్మం):
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందారు. గంగారం గ్రామంలోని భారత్‌ పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా ఆగివున్న లారీని.. బైక్‌ వెనుక నుంచి వేగంగా ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో ఒక విద్యార్ధితో పాటు మరో ఇద్దరు యువకులు మొత్తం ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా ప్రమాద దృశ్యాలు దగ్గరలోని సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి.

సత్తుపల్లి మండలం గంగారాం సెంటర్‌ నుంచి స్వగ్రామం రామ గోవిందపురం వైపు వస్తున్న బేతి సురేష్‌(22),మద్ధిన వేణు (19) తో పాటు అదే గ్రామానికి చెందిన ఆరవ తరగతి విద్యార్థి ఎస్కే కరీముల్లా(11)∙మృతిచెందారు.

గంగారం గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి ఎస్కే కరీముల్లా పాఠశాల నుంచి ఇంటికి వెళ్ళే క్రమంలో స్వగ్రామానికి చెందిన బెతి.సురేష్‌ బండి లిఫ్ట్‌ అడిగి ఎక్కగా బండి ఎక్కిన కొద్ది నిమిషాల్లోనే ప్రమాదానికి గురై అక్కడిక్కడే మృతిచెందారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ANN TOP 10