AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్‌ అమెరికా టూర్‌.. డేట్‌ ఫిక్స్‌

ఆగస్టు 3న వెళ్లనున్న సీఎం బృందం
తిరిగి 11న రాక

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అమెరికా టూర్‌ డేట్‌ ఫిక్స్‌ అయింది. ఆగస్టు 3న రాత్రికి హైదరాబాద్‌ నుంచి సీఎం రేవంత్‌ రెడ్డి బృందం అమెరికా బయలుదేరి వెళ్లనుంది. తెలంగాణలో పెట్టుబడుల కోసం అమెరికాకు ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. అమెరికాలోని డల్లాస్‌ తదితర రాష్ట్రాలలో సీఎం పర్యటించనున్నారు. వారం రోజుల పాటు సీఎం అమెరికాలో పర్యటించనున్నారు. పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలను సీఎం కలవనున్నట్లు సమాచారం. తిరిగి ఆగస్టు 11న హైదరాబాద్‌కు సీఎం తిరిగి రాష్ట్రానికి వస్తారు.

ANN TOP 10