AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పల్నాడు జిల్లా వినుకొండలో దారుణం.. నడిరోడ్డుపై వైసీపీ యువ నేత హత్య

పల్నాడు జిల్లా వినుకొండలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నేత రషీద్‌ను ఓ యువకుడు నడిరోడ్డుపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనతో వినుకొండ ఉద్రిక్తంగా మారింది. పోలీసులు నిందితుడు షేక్ జిలానీని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఇటీవల ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలోని పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

వైసీపీలో యాక్టివ్‌గా పనిచేసిన రషీద్‌.. స్థానికంగా ఓ మద్యం షాపులో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. రషీద్‌పై దాడికి పాల్పడ్డ జిలానీ.. టీడీపీ కార్యకర్తగా తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇద్దరి మధ్య వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? ఇటీవల ఎన్నికల సందర్భంగా వాగ్వివాదం జరిగిందా? తెలియాల్సి ఉంది.

హత్యకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడు జిలానీని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌ను తరలించారు. రషీద్ మరణవార్త విని అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ANN TOP 10