AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విరించి ఆస్పత్రికి హైకోర్టు నోటీసులు.. బీజేపీ నేత మాధవీలతకు షాక్‌..

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
బీజేపీ నేత మాధవీలతకు హైకోర్టు షాక్‌ ఇచ్చింది. మాధవీలతకు చెందిన విరించి హాస్పిటల్‌కు హైకోర్టు నోటీసులిచ్చింది. ఆస్పత్రిలోని వ్యర్థాలను నివాస ప్రాంతాల్లో గుంత తీసి అందులో పూడ్చుతున్నారనే అభియోగాల కేసులో హైదరాబాద్‌ ప్రేమ్‌ నగర్‌లోని విరించి హాస్పిటల్‌కు నోటీసులు ఇచ్చింది. విరించి హాస్పిటల్‌కు వ్యతిరేకంగా ఖైరతాబాద్‌కు చెందిన రిజ్వాన్‌ ఖాన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈరోజు ఈ పిటిషన్‌ పై విచారణ జరిపిన ధర్మాసనం చర్యలకు ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్‌ కోరగా, ప్రభుత్వ వాదనల తర్వాతే ఈ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది.

ANN TOP 10