AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నగర శివారులో మరో రేవ్‌ పార్టీ .. పోలీసుల అదుపులో యువతీయువకులు

మొయినాబాద్‌లో ఘటన
బెంగళూరు ఘటన నుంచి తేరుకోకముందే మరో ముజ్రాపార్టీ

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
బెంగళూరు ఘటన నుంచి తేరుకోకముందే నగర శివారులో మరో రేవ్‌ పార్టీ వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో అర్థరాత్రి రేవ్‌ పార్టీ వెలుగుచూసింది. ఇందులో పాల్గొన్న యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

మొయినాబాద్‌ మండలం సురంగల్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో సోమవారం అర్ధరాత్రి ముజ్రా(అసభ్యకర) పార్టీ జరిగింది. దీనిపై సమాచారం పోలీసులకు అందింది. వెంటనే రాజేంద్రనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు. ఈ పార్టీలో ఆరుగురు యువకులు, ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.

అర్ధనగ్నంగా డ్యాన్స్‌లు..
పట్టుబడినవారిని మొయినాబాద్‌ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం వారిని అక్కడి పోలీసుస్టేషన్‌లో విచారిస్తున్నారు. ఈ పార్టీలో పాల్గొన్న నలుగురు అమ్మాయిలు ఢిల్లీ నుంచి ఇక్కడకు తీసికొచ్చినట్టు తెలుస్తోంది. ఫామ్‌ హౌస్‌లో వీరంతా అసభ్యకర రీతిలో అర్ధనగ్నంగా డ్యాన్స్‌ సన్నివేశాలను చూసి పోలీసులు షాకయ్యారు.

కూపీలాగుతున్న పోలీసులు..
ఇంతకీ ఫామ్‌హౌస్‌ ఎవరిది? ఈ పార్టీ వెనుక ఎవరున్నారు? అనేదానిపై కూపీ లాగే పనిలో పడ్డారు పోలీసులు. దీని వెనుక బడా బాబుల పుత్రరత్నాలు వున్నట్లు అంతర్గత సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సివుంది.

ANN TOP 10