AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జిల్లాలపై రేవంత్‌ ఫోకస్‌.. నేడు మహబూబ్‌నగర్‌ జిల్లాలో సీఎం పర్యటన

సీఎం రేవంత్‌ రెడ్డి జిల్లాల పర్యటనను ప్రారంభించారు. వరంగల్‌ తర్వాత ఇవాళ మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అభివృద్ధిపై సమీక్ష చేయనున్నారు. నీటిపారుదల, విద్య, వైద్యం, పర్యాటకంపై అధికారులతో సమావేశం కానున్నారు. పాతకలెక్టరేట్‌ ప్లేస్‌లో రూ.500 కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించనుంది రేవంత్ సర్కార్.

ఈ ఆసుపత్రి నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని సీఎం రేవంత్‌ భావిస్తున్నారు. అధికారిక పర్యటన తర్వాత ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో పార్టీ కార్యక్రమం జరగనుంది. సీఎం రేవంత్‌ సమక్షంలో ఇతర పార్టీ కీలక నేతలు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న సీఎంను ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి కలిశారు. ఆలంపూర్‌ ఎమ్మెల్యే పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది.

ANN TOP 10