AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జూబ్లీహిల్స్‌లో నడిరోడ్డుపై బీఎండబ్ల్యూ కారు దగ్గం

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నడ్డిరోడ్డుపై బీఎండబ్ల్యూ కారు దగ్దమైంది. ఆ సమయంలో ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. ఇంతకీ వాహనం ఎవరిది? ఏం జరిగింది? ఇలా రకరకాల ప్రశ్నలు చాలామంది వెంటాడుతున్నాయి.

శనివారం రాత్రి 10 గంటలు దాటింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 కూడలి మీదుగా ఫిల్మ్‌నగర్ వైపు బీఎండబ్ల్యూ కారు వెళ్తోంది. మరి ఏం జరిగిందో తెలీదుగానీ ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. వెంటనే అలర్టయిన వ్యక్తులు కారు నుంచి బయటదిగి కొంతదూరం పరుగులుపెట్టారు. చివరకు ప్రాణాలు కాపాడుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న వెంటనే జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే ఆ కారు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ముఖ్యంగా మెయిన్ రోడ్డుపై ఘటన జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇంతవరకు బాగానే ఉంది. అసలు వాతావరణం చల్లగా ఉంది.

అయినా కారులో ఎలా మంటలు వచ్చాయన్నది అసలు పాయింట్? అందులోనూ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన బీఎండబ్ల్యూ కారు దగ్దమైన ఘటనలు పెద్దగా లేవని అంటున్నారు అక్కడి ప్రజలు. ప్లాన్ ప్రకారమే కారు తగలబడిందా? ఈ ఘటన వెనుక ఎవరైనా ఉన్నారా? వంటి ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. దీనిపై పోలీసులు అన్నికోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు.

ANN TOP 10