AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రామోజీరావు పాడె మోసిన నారా చంద్రబాబు

మీడియా మొఘల్, ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు అంతిమయాత్రలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న బాబు.. ఇవాళ అంతిమ సంస్కారాల్లో కూడా పాల్గొన్నారు. రామోజీరావుకు అంజలి ఘటించిన చంద్రబాబు.. స్మృతివనం వరకు పాడె మోసారు. దు:ఖం ఆపుకోలేక.. తీవ్ర భావోద్వేగంతోనే ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత పాల్గొన్నారు.

ఉదయం 9 గంటలకు ఫిల్మ్‌సిటీలోని నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర 11:00 గంటలకు స్మృతివనం చేరుకుంది. పెద్ద ఎత్తున సినీ, రాజకీయ ప్రముఖులు, తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, ఈనాడు సంస్థల ఉద్యోగులు, వీరాభిమానులు.. రామోజీరావును కడసారి చూసేందుకు తరలివచ్చి వీడ్కోలు పలికారు.

ANN TOP 10