తెలంగాణలో రుతుపవనాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. నిజామాబాద్ మీదుగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని వివరించింది. 2 రోజుల్లో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో 2 రోజులు వర్షాలు కుస్తాయని పేర్కొంది. ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ తెలిపింది. రుతుపవనాలు వేగంగా వ్యాపించడం, ఉపరితల ఆవర్తనం కారణంగా పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. శుక్రవారం హైదరాబాద్ తో పాటు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వాన పడింది. వానలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వర్షం కురుస్తున్న సమయంలో ఈదురు గాలులు, మెరుపులు, ఉరుములతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. ఆవర్తనం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఇక ఉత్తర తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రుతుపవనాలు తెలంగాణ అంతట విస్తరించిన తర్వాత ఉత్తర తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.









