AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎంపీల్లో 93% మంది కోటీశ్వరులే: ఏడీఆర్‌

సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల్లో 93శాతం మంది కోటీశ్వరులేనని ‘అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌’ (ఏడీఆర్‌) తెలిపింది. గత ఎంపీల్లో 475 మంది మిలియనీర్లు ఉండగా, వీరి సంఖ్య ఈసారి 504కు పెరిగిందని వెల్లడించింది. ధనిక ఎంపీల్లో గుంటూరు టీడీపీ అభ్యర్థి చంద్రశేఖర్‌ పెమ్మసాని రూ.5,705 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, చేవెళ్ల బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డి రూ.4,568 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారని తెలిపింది.

46శాతం మందిపై క్రిమినల్‌ కేసులు
543 మంది ఎంపీల్లో 251 మందిపై (46శాతం) క్రిమినల్‌ కేసులున్నాయని, ఇందులో 27 మంది దోషులుగా తేలారని ఏడీఆర్‌ తెలిపింది. క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న అభ్యర్థులు లోక్‌సభకు ఈ స్థాయిలో ఎంపిక కావటం ఇదే మొదటిసారి అని పేర్కొన్నది. లోక్‌సభకు కొత్తవారు 280మంది ఈసారి 280 మంది కొత్త ఎంపీలు లోక్‌సభలో అడుగుపెట్టబోతున్నారు. లోక్‌సభలో మొత్తం 543 మంది సభ్యులు ఉండగా, వీరిలో కొత్త ఎంపీలు 52 శాతం.

ANN TOP 10