AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నాణ్యమైన పట్టు వస్త్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ : సుధాజైన్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం నాణ్యమైన పట్టు వస్త్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని సోషలైట్ డాక్టర్ సుధాజైన్ అన్నారు. గురువారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుధాజైన్ మాట్లాడుతూ.. చేనేత కళా కారుల ఉత్పత్తులను దేశ, విదేశాలకు పంపి చేనేత కళాకారుల ప్రతిభను చాటిచెప్పడం తమ లక్ష్యమని, చేనేత వస్త్రాలను కోనేలాగా వారు చేనేత ఉత్పత్తులను ధరించేలా చేయడమే తమ కోహినూర్ స్టోరీ ఉద్దేశమని అన్నారు.

చేనేత ఉత్పత్తులను తయారు చేసే వారిని ప్రోత్సహిస్తూ తమవంతుగా చేయూతనివ్వడమే తమ ధ్యేయమని, చేనేత కళాకారుల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు తాము దోహద పడతామని శ్రీ పాండురంగ హ్యాండ్లూమ్స్ చిట్టిమల్ల పాండు చెప్పారు. విభిన్నమైన, అరుదైన చేనేత ఉత్పత్తులను వినియోగ దారులకు అందించడంతోపాటు వాటి పట్ల ఆదరణ పెంచడమే తమ ఉద్దేశ్యం అని ఆయన తెలిపారు.

దేశవ్యాప్తంగా ఉన్నచేనేతనేత కార్మికులను గౌరవించడం, ప్రోత్సహించడంమే ఈ కోహినూర్ ఉద్దేశ్యం అని తెలిపారు. మార్కెట్ లో లభించే నకిలీ పట్టు వస్త్రాలను ఎలా తెలుసుకోవాలో,నాణ్యమైన చేనేత వస్త్రాలను ఎలా గుర్తించాలో కూడా ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు.

కొంత మంది సింథటిక్ ను సిల్క్ గా అమ్ముతున్నారు. దీనిపై అవగా వాహన కల్పించడానికి తమ సంస్థ కృషి చేస్తోందని అన్నారు. చేనేత కళాకారుల డిజైన్లకు ఒక రూపు తెచ్చి వారు రూపొందించిన డిజైన్లను ఇతరులు కాపీ చేయకుండా ఒక అల్బమ్ ను ఈ సందర్భంగా విడుదల చేశామని సుధజైన్ వెల్లడించారు.

ANN TOP 10