AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పవన్‌ కల్యాణ్‌ సంబరాల్లో కనిపించని అల్లు కుటుంబ సభ్యులు

ఎంఎల్ఏ గా మొదటిసారి గెలిచిన పవన్ కళ్యాణ్, తన తల్లి, అన్నయ్య, వదినలు ఆశీర్వచనాలు తీసుకోవడానికి చిరంజీవి ఇంటికి ఈరోజు వెళ్లారు. అక్కడ మొత్తం కొణిదెల కుటుంబ సభ్యులు, చిరంజీవి సోదరులు, సోదరీమణులు, అందరూ వున్నారు. కానీ అక్కడ అల్లు కుటుంబ సభ్యులు మాత్రం మిస్ అయ్యారు. ఇదే విషయం ఇప్పుడు పరిశ్రమలో ఒక పెద్ద చర్చగా నడుస్తోంది.

ఒక్కసారి గతంలోకి వెళితే, పిఠాపురంలో ఎన్నికల ప్రచారం ఊపందుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ ని కలవడానికి రామ్ చరణ్, అతని తల్లి సురేఖ పిఠాపురం బయలుదేరి వెళ్లారు. అదే రోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డితో నంధ్యాల బయలుదేరి వెళ్లారు. ఎందుకంటే తన స్నేహితుడు శిల్ప రవికిశోర్ చంద్ర రెడ్డి పిలవకపోయినా, తను వెళ్లి అతనికి ఎన్నికల్లో గెలిపించడానికి అని చెప్పారు.

అదీ కాకుండా, రామ్ చరణ్, అతని తల్లి సురేఖమ్మ పవన్ కళ్యాణ్ ని కలవటానికి వెళ్లిన రోజే అల్లు అర్జున్ వెళ్లడం. ఇవన్నీ పెద్ద వివాదాలకు తయారీ తీసింది అప్పుడు.

ఇవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇంటికి వచ్చిన సందర్భంలో ఒక్క అల్లు కుటుంబ సభ్యుడు కూడా కనపడక పోవటం పరిశ్రమలో పెద్ద చర్చ నడుస్తోంది. ముందు ముందు ఏమవుతుందో చూడాలి.

ANN TOP 10