AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రైతుల్ని అవ‌మానిస్తావా?.. ఎంపీ కంగ‌నాను కొట్టిన కానిస్టేబుల్‌

న్యూఢిల్లీ: కొత్త‌గా లోక్‌స‌భ‌కు ఎన్నికైన ఎంపీ కంగ‌నా ర‌నౌత్‌(Kangana Ranaut)పై .. సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూర్టీ ఫోర్స్‌కు చెందిన ఓ మ‌హిళా కానిస్టేబుల్ చేయి చేసుకున్న‌ది. చండీఘ‌డ్ విమానాశ్ర‌యంలో విధులు నిర్వ‌హిస్తున్న ఆ కానిస్టేబుల్‌.. కంగ‌నా రనౌత్ చెంప‌పై దెబ్బ కొట్టారు.

రైతుల ఉద్య‌మ స‌మ‌యంలో రైతుల్ని అగౌర‌వ‌ప‌రిచార‌న్న ఉద్దేశంతో ఆ కానిస్టేబుల్ అటాక్ చేసిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా జ‌రిగిన 18వ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో .. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని మండీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె బీజేపీ అభ్య‌ర్థిగా విజ‌యం సాధించారు. అయితే ఢిల్లీ వెళ్లేందుకు చంఢీఘ‌డ్ ఎయిర్‌పోర్టు చేరుకున్న ర‌నౌత్‌కు అక్క‌డ చేదు అనుభ‌వం ఎదురైంది.

ANN TOP 10