AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు.. ఎవరెవరి మధ్య పోటీ ఉందంటే..?

నల్లగొండ – వరంగల్ – ఖమ్మం శాసనమండలి ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని తిప్పర్తి మండలం అనిశెట్టిదుప్పలపల్లి గోదాంలో ఓట్లను లెక్కిస్తున్నారు. నాలుగు రౌండ్లలో మొత్తం 96 వేల తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. నాలుగు హాళ్లు, 96 టేలుళ్లపై ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే, కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఈ నియోజకవర్గ పరిధిలో మొత్తం 4,63,839 మంది ఓటర్లు ఉండగా 72.44 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. అర్ధరాత్రి లోపు తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశముందని భావిస్తున్నారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరగడంతో ఓట్ల లెక్కింపు ఆలస్యం కానున్నది.

కాగా, రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ మే 13న నిర్వహించగా, జూన్ 4న ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో బీజేపీ అభ్యర్థులు 8 మంది, కాంగ్రెస్ అభ్యర్థులు 8 మంది విజయం సాధించగా, మిగతా ఒక్క సీటు ఎంఐఎం ఖాతాలో పడింది. బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ సంబరాలు జరుపుకుంటున్నాయి.

ANN TOP 10