AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కరీంనగర్‌లో బండి సంజయ్ జోరు.. 63,985 ఓట్లతో ఆధిక్యం

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముమ్మరంగా సాగుతోంది. మొత్తం 17 స్థానాలకుగాను 8 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉండగా… 7 చోట్ల కాంగ్రెస్‌, ఒక స్థానంలో మజ్లిస్‌ ముందంజలో ఉన్నాయి. 120 హాళ్లలో 1,855 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతోంది. చొప్పదండి, దేవరకొండ, యాకుత్‌పురాలో అత్యధికంగా 24 రౌండ్లలో కౌంటింగ్‌ జరగనుంది. ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేటలో అత్యల్పంగా 13 రౌండ్లలో కౌంటింగ్‌ జరగనుంది.

కరీంనగర్‌లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 5 రౌండ్‌ పూర్తయ్యేసరికి 63,985 ఓట్లతో బండి సంజయ్ ముందంజలో ఉన్నారు.

ANN TOP 10