AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థికి భారీ ఆధిక్యం.. 1.70 లక్షల లీడ్‌లో రఘువీర్ రెడ్డి

★నల్గొండ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో దూసుకెళ్తుంది. ఆరో రౌండ్ పూర్తయ్యేసరికి ఆ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి 1.70 లక్షల మెజార్టీతో ముందంజలో నిలిచారు.

★మహబూబ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ లీడ్‌లో కొనసాగుతున్నారు. మూడో రౌండ్ పూర్తయ్యే సరికి 6,984 ఓట్ల మెజార్టీ సాధించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్లమెంట్ నియోజకవర్గమైన మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి రెండో స్థానంలో కొనసాగుతున్నారు.
★వరంగల్‌లో కాంగ్రెస్ అభ్యర్తి కడియం కావ్య ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. నాలుగో రౌండ్ ముగిసే సరికి ఆమె 34,522 ఓట్ల మెజార్టీతో దూసుకెళ్తున్నారు.

★నిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్థి అర్వింద్ ముందంజలో ఉన్నారు. ఆయన 23,936 ఓట్ల మెజార్టీతో దూసుకెళ్తున్నారు. రౌండ్ రౌండ్‌కు ఆధిక్యాన్ని పెంచుకుంటున్నారు. చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండా భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి 30,342 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.

తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఈసారి ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు.

ANN TOP 10