(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి బిగ్ షాక్ ఇచ్చింది. ఈ కేసులో సోమవారంతో ఆమె కస్టడీ ముగియడంతో కవితను కోర్టులో హాజరుపరిచారు. అనంతరం విచారణ జరిపిన కోర్టు కవిత జ్యుడీషియల్ కస్టడీని నెల రోజులు పొడిగించింది. దీంతో ఆమె జూలై 3 వరకు జైలులో ఉండనున్నారు. కాగా ఢిల్లీ మద్యం కేసులో ఈడీ, సీబీఐ కేసుల్లో ఎమ్మెల్సీ కవిత మార్చి 26 నుంచి జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
‘జై తెలంగాణా, జై భారత్’ అంటూ నినాదాలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత రిమాండ్ ముగియడంతో సోమవారం తీహార్ జైలు అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. కాగా కోర్టులోకి వస్తున్న సందర్భంలో ఎమ్మెల్సీ కవిత ‘జై తెలంగాణా, జై భారత్’ అంటూ నినాదాలు చేశారు.









