AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాష్ట్రాలు రెండైనా.. తెలుగు ప్రజలంతా ఒక్కటే: చంద్రబాబు

రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటేనని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 10 సంవత్సరాలు అయ్యిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పేదరికం లేని దిశగా 2 తెలుగు రాష్ట్రాల ప్రయాణం సాగాలని ,ఆర్ధిక సమానతలు నిర్మూలించి సమగ్ర సాధికారిత సాధించాలని కోరారు. తెలుగు ప్రజల విజయాల కీర్తి ప్రపంచవ్యాప్తం కావాలని పిలుపునిచ్చారు.ఇండియా స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తి అయ్యే 2047 నాటికి ప్రపంచంలో ఇండియా అగ్రస్థానంలో ఉండాలన్నారు. అందులో తెలుగు జాతి నెంబర్ 1 అవ్వాలని ఆకాంక్షిస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.

ANN TOP 10