AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేటీఆర్ స్టేట్మెంట్ రాంగ్: మంత్రి మంత్రి జూపల్లి కృష్ణారావు

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాంకేతికంగా బీఆర్‌ఎస్ గెలిచిందని నైతికంగా కాంగ్రెస్ గెలిచిందని ఎక్సైజ్ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ కి శుభాకాంక్షలు తెలిపారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై స్పందించారు. ముందుగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. నైతికంగా కాంగ్రెస్ గెలిచిందని తెలిపారు. 920 బీఆర్ఎస్, 350 కాంగ్రెస్, 100 బీజేపీకి ఓట్లు ఉన్నాయని, 763 ఓట్లు బీఆర్ఎస్‌కు, 662 కాంగ్రెస్ వచ్చాయన్నారు. ప్రజల దృష్టి కాంగ్రెస్ వైపు ఉందిని, కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా కాంగ్రెస్‌కి ఓటు వేశారన్నారు. 2018 ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రతి పక్షం లేకుండా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్నారు. కేసీఆర్ లాగా తాము చేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అలా చేయాలి అంటే గెలిచే వాళ్ళమని, కాంగ్రెస్‌కి 300 ఓట్లు అధికంగా వచ్చేవి అన్నారు. తాము విజయం సాధించాం అని కేటీఆర్ అంటున్నారని తెలిపారు. ఇంకా 48 గంటల్లో పార్లమెంట్ ఫలితాలు వస్తాయని, విజయం ఎవరి వైపు ఉంటుందో తెలుస్తుందన్నారు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మెజారిటీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్ రాంగ్ అని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందని జూపల్లి కృష్ణరావు కామెంట్స్ చేశారు.

ANN TOP 10