AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేళ.. అందెశ్రీ భావోద్వేగం

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం పరేడ్‌ గ్రౌండ్‌ లో తెలంగాణ అవతరణ దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా కవి అందెశ్రీ రచించిన రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ పాటను సీఎం రేవంత్‌రెడ్డి జాతికి అంకితం చేశారు. ఆ సమయంలో స్టేజి మీద ఉన్న అందెశ్రీ జై తెలంగాణ నినాదంతో కన్నీరు పెట్టుకున్నారు. కాగా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆ వీడియోలో అందెశ్రీ జయ జయహే తెలంగాణ పాటను జాతికి అంకితం చేస్తున్న సమయంలో భావోద్వేగానికి గురికావడం కనిపించింది. కాగా ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. అందెశ్రీకి తగిన గుర్తింపు దక్కిందని.. అందుకు ఆయన భావోద్వేగానికి గురయ్యారని కామెంట్లు చేస్తున్నారు.

ANN TOP 10