AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు: సీఈవో వికాస్ రాజ్

కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలియజేశారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. జూన్ 4 న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. 38 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతుందన్నారు. 120 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామన్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం 19 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈసీ రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. 12 కేంద్ర బలగాలతో కౌంటింగ్ కేంద్రాల భద్రత ఉంటుందన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకువెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. 135 స్కానింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, మూడు చోట్ల 24 రౌండ్స్ ఉన్నాయన్నారు.

యాకుత్‌పుర, చొప్పదండి, దేవరకొండలో 24 రౌంట్లలో కౌంటింగ్ జరనుందన్నారు. ఆర్మూర్, భద్రాచలం, అశ్వరావుపేటలో 13 రౌండ్లలో కౌంటింగ్ జరగనుందన్నారు. కౌంటింగ్ ఏజెంట్ల వద్ద, సిబ్బంది వద్ద కూడా ఫోన్లు ఉండదన్నారు. కౌంటింగ్‌ కేంద్రంలో ప్రతిమూల కవర్ చేసేలా సీసీ కెమెరాల నిఘా ఉంటుందన్నారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి లెక్కింపు కేంద్ర వరకు, బారికేడ్లు, పటిష్ట భద్రత ఉంటుందని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం 276 టెబుళ్లు ప్రత్యేకంగా ఉంటాయన్నారు. మధ్యాహ్నం 3 గంటలలోపు కౌంటింగ్ పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత 6: 30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ ప్లే చేసుకోవచ్చని సీఈవో వికాస్ రాజ్ స్పష్టం చేశారు.

ANN TOP 10