స్థల వివాదం కారణం.. ఏకంగా సమ్మక్క సారలమ్మ ఆలయం మూసివేసే పరిస్థితి ఏర్పడింది. ఈ వివాదం నేపథ్యంలోనే సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని రెండు రోజులు మూసివేస్తున్నట్లు మేడారం ఆలయ పూజారులు ప్రకటించారు. మే 29, 30వ తేదీల్లో సమ్మక్క – సారలమ్మ ఆలయాలను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు కారణం ప్రభుత్వమేనని చెబుతున్నారు పూజారులు.
వరంగల్ పాత సెంట్రల్ జైలు ఎదుట ఉన్న వెయ్యి గజాల స్థలాన్ని గతంలో ప్రభుత్వం తమకు కేటాయించిందని.. ఇప్పుడు ఆ స్థలాన్ని భద్రకాళీ ఆలయానికి కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మేడారం పూజారులు ఆరోపించారు. ఆ స్థలాన్ని తమకు అప్పగించాలని మేడారం పూజారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మే 29, 30 తేదీల్లో ఆలయాన్ని మూసివేసి ధర్నాకు పిలుపునిచ్చారు. వరంగల్‌లోని సెంట్రల్ జైలు ఎదుట గల స్థలంలోనే ధర్నా చేపట్టనున్నట్లు పూజారులు తెలిపారు.









