AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృవియోగం

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా త‌ల్లి మాధ‌వి రాజె సింధియా బుధ‌వారం క‌న్నుమూశారు. ఆమె గ‌త కొంతకాలంగా న్యుమోనియాతో బాధ‌ప‌డుతూ ఎయిమ్స్‌లో వెంటిలేట‌ర్‌పై ఉన్నారు. గ్వాలియ‌ర్ రాజ‌కుటుంబానికి చెందిన రాజ‌మాత‌, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా త‌ల్లి మ‌ర‌ణించార‌ని ఆమె ఈరోజు ఉద‌యం 9.28 గంట‌ల‌కు తుదిశ్వాస విడిచార‌ని సింధియా కార్యాల‌యం నుంచి వెలువ‌డిన అధికారిక ప్ర‌క‌ట‌న పేర్కొంది.

కొద్దినెల‌లుగా మాధ‌వి రాజె ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. మాధ‌వి రాజె మ‌ర‌ణం ప‌ట్ల మ‌ధ్య‌ప్ర‌దేశ్ బీజేపీ చీఫ్ వీడీ శ‌ర్మ సంతాపం తెలిపారు. గ్వాలియ‌ర్ రాజ‌మాత ఇక లేర‌నే విషాద వార్త విన‌డం తాను విచార‌క‌ర‌మ‌ని ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా పేర్కొన్నారు. కేంద్ర పౌర‌విమాన‌యాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని గుణ నుంచి బీజేపీ అభ్య‌ర్ధిగా పోటీ చేస్తున్నారు.

ANN TOP 10