AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

SRH vs MI: హైదరాబాద్‌కు కీలకమైన మ్యాచ్

ఐపీఎల్ 2024 సీజన్ చివరి దశకు చేరుకుంటోంది. ప్లే ఆఫ్ బెర్త్‌ ను కన్ఫామ్ చేసుకునేందుకు జట్లు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని జట్లకు ప్లే ఆఫ్ ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి. ఎక్కువ ఓటములు చెంది పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న జట్లకు ప్లే ఆఫ్ లో చోటు దక్కే అవకాశం లేనట్లే అనుకోవాలి. ఇక నేడు ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడబోతుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7. 30 గంటలకు జరగనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ జట్టుకు కీలకంగా మారింది. ఎంఐ ఇప్పటికే వరస ఓటములతో పూర్తిగా వెనకబడి ఉండగా ఎస్‌ఆర్‌హెచ్ జట్టు మాత్రం ప్లే ఆఫ్ లో చోటు సంపాదించేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో మరింత ఎగబాకి ప్లే ఆఫ్ కు చేరుకునేందుకు సన్ రైజర్స్ దూకుడుగా ఉంది.

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆల్ టైమ్ రికార్డులు బద్దలు కొడుతున్న హైదరాబాద్ టీమ్ 300 పరుగుల స్కోర్ పై కన్నేసింది. భారీ స్కోరు చేసి ఈ మ్యాచ్ ఎలాగైన గెలువాలని పట్టుదలతో ఉంది. ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసిన్, నితీశ్ కుమార్ రెడ్డి, భీకర ఫామ్ లో ఉండటంతో ఎస్ఆర్హెచ్ కు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. మరోవైపు, వరుస ఓటములతో ముంబై ఇండియన్స్ డీలా పడింది. 11 మ్యాచుల్లో 3 గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది.అందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ లాంటి టీమ్స్ ఉన్నాయి. ఇవి ఎంత పోరాడినా ప్లే ఆఫ్ కు చేరే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే ఈ జట్లు ప్లే ఆఫ్ ఆశలు దాదాపు వదులుకున్నట్లేనని చెప్పుకోవాలి.

ANN TOP 10