బయటపడ్డ మాజీమంత్రి ఆడియో
ఖమ్మం రాజకీయాల్లో సెన్షేషన్
సొంత పార్టీ ప్రత్యర్థులపై పువ్వాడ మార్కు స్కెచ్ లు
లేపేస్తారా.. కదలకుండా చేస్తారా చేసేయండి
చేతకాకపోతే నేనే రెండు కాళ్లు తీయిస్తా
మంత్రి తుమ్మల, మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి పై నోటి దురుసు
ఉపేందర్ రెడ్డి పిచ్చి రెడ్డి
తాతా మధు కు చెక్ పెట్టేలా ప్లాన్
ఉపేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు వేణుపై స్కెచ్ కు అనుచరులకు సలహా
సొంతపార్టీ ప్రత్యర్ధులపై దాడి గురించి.. సినీ ఫక్కీలో ప్రత్యర్ధులతో చర్చ
అసెంబ్లీ ఎన్నికల నాటి ఆడియో బయటకు
సూపర్ ఎక్స్ క్లూజివ్
(అమ్మన్యూస్ ప్రత్యేక ప్రతినిధి)
రాజకీయమంటే రక్తంతో చేతులు కడుక్కోవడమా? కానీ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి అదే రాజకీయం అంటున్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో అసెంబ్లీ ఎన్నికల ముందు సహచరులతో చర్చించిన ఆడియో ఖమ్మం హాట్ టాపిక్ గా మారింది.
ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ సహచరులతో చర్చించిన ఆడియో కలకలం సృష్టిస్తుంది. ఈ ఆడియో ఎక్స్ క్లూజివ్ గా అమ్మన్యూస్ కు చిక్కింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంఎల్సి తాతా మధు, పాలేరు మాజీ ఎంఎల్ఏ ఉపేందర్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరరావు, హత్యకు గురైన తమ్మినేని కృష్ణయ్యని ఎవరిని వదలకుండా పరుష పదజాలాలతో ఆ ఆడియోలో దూషించారు. బిఆర్ఎస్ ఖమ్మం రూరల్ మండలం అద్యక్షులు పాలేరు మాజీ ఎంఎల్ఏ ఉపేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు బెల్లం వేణును కట్టడి చేసేందుకు దాడి ఎలా ఉండాలో వివరించిన తీరు..సినిమాలో క్రిమినల్ ను తలపిస్తుంది. వరంగల్ క్రాస్ రోడ్‌లో తల నరికితే , తల మొండెం వేరు వేరు ఉండాలని అందులో డైరెక్షన్ ఇచ్చారు. కామంచికల్లు గ్రామం సిపిఐ నాయకులు మేదరమెట్ల శ్రీనివాస్ పై దాడి ఎలా ఉండాలో,అప్పటికే చేసిన దాడి ఎలా ఉందో చేసిన సంభాషణ విస్మయానికి గురిచేస్తోంది. స్వంత పార్టీ నేతలపై కక్ష్య సాధింపు చర్యలు… పాల్పడటం కలవర పెడుతోంది.
ఖమ్మం జిల్లాలో సెన్షేషన్
ఖమ్మం జిల్లా లో మాజీ మంత్రి పువ్వాడ ఆడియో సెన్షేషన్ గా మారింది. ఇటీవల మామిడితోటలో తుమ్మల మర్డర్ కు స్కెచ్ వేశారన్న చర్చజరగ్గా, ఇపుడు మరో ఆడియో పువ్వాడ పేరుతో బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీనేతలపై బూతులతో ఆడియోలో రెచ్చిపోవడం చర్చనీయాంశంగా మారింది. పరుష పదజాలంతో ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డిపై వ్యాఖ్యలు , హత్యకు గురైన తమ్మినేని కృష్ణయ్య-సీపీఐ నేత మౌలానా-తుమ్మలపై అనుచిత వ్యాఖ్యలు ఈ ఆడియోలో ఉన్నాయి. ఖమ్మం జిల్లా రక్తచరిత్ర కూడా ఆ ఆడియోలో వివరించారు. ఈ ఆడియో ఖమ్మం జిల్లాలో సెన్షేషన్ గా ఉంది. బీఆర్ఎస్ తో పాటు అన్ని రాజకీయపార్టీల్లోనూ ఇది కలకలం రేపుతోంది. సొంతపార్టీ నేతలపై కూడా పువ్వాడ కేసులు పెట్టించారన్న ఆరోపణలు ఉండగా, పువ్వాడ తీరుపు తుమ్మల, పొంగులేటి అనుచరులు గతంలో తీవ్రస్థాయిలో భగ్గుమన్నారు.









