AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అభివృద్ధిపై చర్చకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ సిద్ధమా?.. జగ్గారెడ్డి సవాల్‌

(అమ్మన్యూస్‌, హైదరాబాద్‌):
కాంగ్రెస్‌ పార్టీ పాలనలో దేశంలో జరిగిన అభివృద్ధి పనులపై చర్చకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు సిద్ధమా అని కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి సవాలు విసిరారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిందని అన్నారు.

దేశానికి పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్‌ అని జగ్గారెడ్డి చెప్పారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల్లా తమ పార్టీ అసత్యపు వాగ్దానాలు చేయదని అన్నారు. రాహుల్‌ గాంధీ ప్రధాని అయితేనే దేశానికి భద్రత ఉంటుందని అన్నారు. చరిత్ర అంటే మహాత్మా గాంధీ, జవహర్‌ లాల్‌ నెహ్రూ, రాహుల్‌ గాంధీది అని చెప్పుకొచ్చారు.

నెహ్రూ, ఇందిరా చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కోరతానని అన్నారు. రైతులు పండిరచిన పంటను నెహ్రూ 200 దేశాలకు ఎగుమతి చేయించారని తెలిపారు. దేశ ప్రజల కోసం గాంధీ, నెహ్రూ కుటుంబం తమ జీవితాలని త్యాగం చేసిందని చెప్పారు.

నెహ్రూ దేశానికి స్వాతంత్య్రం కోసం చిన్న వయసులోనే 16 సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపారని జగ్గారెడ్డి తెలిపారు. ఎలక్షన్‌ కమిషన్‌ ను తీసుకొచ్చారని అన్నారు. బీజేపీ నాయకులు కాదంటారా అని నిలదీశారు. బీజేపీ మాత్రం ఓట్ల కోసం శ్రీరాముడిని రాజకీయాల్లోకి లాగుతోందని విమర్శించారు.

ANN TOP 10