AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

పార్లమెంట్ ఎన్నికల ముందు కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్‌కు షాక్‌లు తప్పడం లేదు. ఆ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. అధికారాన్ని కోల్పోయి నాలుగు నెలలు కూడా గడవకముందే బీఆర్ఎస్ నాయకులంతా ఇతర పార్టీల్లోకి వరుస కడుతుండడం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. ఇప్పటికే కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుతో పాటు ముఖ్యనేతలు ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే పార్టీ అగ్రనేతలతో మంతనాలు జరిపిన ప్రకాశ్ గౌడ్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పేసుకుంటారని చెబుతున్నారు. ప్రకాశ్ గౌడ్ రాకకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా ఓకే చెప్పినట్లు తెలిసింది. ఈ సందర్భంగా శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దీంతో ప్రకాష్ గౌడ్ కూడా అధికారికంగా చేరడం ఖాయమయిపోయినట్లేనని అంటున్నారు. రేపు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది.

ANN TOP 10