రాయి దాడి ఘటనపై సీఎం జగన్ (CM Jagan) తొలిసారి స్పందించారు. విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద తనను కలిసిన కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలను ఆయన కలిశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసే దాడులు చేస్తున్నారన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ప్రాణాపాయం తప్పిందని, మరోసారి అధికారంలోకి వస్తున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. తనను ఎలాంటి దాడులు ఆపలేవన్నారు. ప్రజల మద్దతుతో మరింత ముందుకెళ్తానన్నారు.
ఏ ఒక్కరూ ఆందోళన చెందవద్దని జగన్ చెప్పారు. ధైర్యంతో ముందడుగు వేద్దామని కార్యకర్తలతో పేర్కొన్నారు. దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం తమకు ఉన్నాయన్నారు. ప్రజల ఆశీస్సులతోనే దాడి నుంచి తప్పించుకోగలిగానని తెలిపారు. ఒకరోజు విరామం తరువాత సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు.









