కవిత తీరుపై కోర్టు ఆగ్రహం
ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
విచారణకు సహకరించడంలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై సీబీఐ సంచలన ఆరోపణలు చేసింది. సోమవారం నాటితో కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కీలక తీర్పునిచ్చింది. ఈ నెల 23వ తేదీ వరకు కస్టడీ పొడిగిస్తూ తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా కవితపై కోర్టులో సీబీఐ కీలక ఆరోపణలు చేసింది. మూడ్రోజుల కస్టడీలో కవిత దర్యాప్తునకు సహకరించ లేదని అన్నారు. శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న రూ.14 కోట్లపై తప్పుదోవ పట్టించేలా కవిత జవాబులు చెప్పారని అసహనం వ్యక్తం చేశారు. లేని భూములు ఉన్నట్లుగా చూసి అమ్మకానికి పాల్పడటంపై ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు.
23 వరకు కవితకు జ్యుడీషియల్ కస్టడీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఈ నెల 23 వరకు కవితకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. లిక్కర్ స్కామ్ కేసులో కవితను మూడు రోజులు సీబీఐ కస్టడీకి అప్పగించారు. ఈ మూడు రోజుల కస్టడీ నేటితో ముగియడంతో.. ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాదులు, కవిత తరఫున న్యాయవాదుల మధ్య వాదోపవాదనలు జరిగాయి. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించామని.. విచారణకు ఆమె సహకరించలేదని సీబీఐ ఆరోపించింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. కవితను 9 రోజుల జ్యూడీషియల్ కస్టడీకి అప్పగించింది. దీని ప్రకారం.. కవిత ఏప్రిల్ 23వ తేదీ వరకు జ్యూడీషియల్ కస్టడీలో ఉండనున్నారు.
జై తెలంగాణ నినాదంతో..
కాగా, ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది సీబీఐ. కోర్టులోకి వెళ్లే ముందు కవిత జై తెలంగాణ నినాదం చేశారు. వాదనల అనంతరం కోర్టు నుంచి బయటకు వచ్చిన ఆమె.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది సీబీఐ కస్టడీ కాదని.. బీజేపీ కస్టడీ అని ఆరోపించారు. బయట బీజేపీ వాళ్లు అడగిందే.. లోపల సీబీఐ అడుగుతోందన్నారు. రెండు నెలల నుంచి అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని, కొత్తగా ఏమీ లేదన్నారు కవిత. కాగా, కవిత ఏప్రిల్ 23వ తేదీ వరకు తీహార్ జైల్లో ఉండనున్నారు.









