AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మహాత్మా గాంధీని అవమానించేలా రీల్..! పాపులర్ ఇన్‌ఫ్లుయెన్సర్ షాక్..!

గుజరాత్‌లోని సూరత్‌ నగరానికి చెందిన ప్రముఖ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 500 కరెన్సీ నోటుపై ఉన్న మహాత్మా గాంధీ చిత్రాన్ని అనుచిత రీతిలో చూపుతూ, అత్యంత అభ్యంతరకమైన సైగలతో రీల్చేసినందుకు గానూ ఈ చర్యలు తీసుకున్నట్లు సూరత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు.

సూరత్‌లోని అడాజన్ ప్రాంతంలో నివాసముంటున్న 47 ఏళ్ల సిమ్రాన్ పటేల్‌‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు పది లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. గాంధీ జయంతికి ముందు రోజు అంటే అక్టోబర్ 1న మధ్యాహ్నం ఈ వివాదాస్పద వీడియోను సోషల్ మీడియా ఖాతాల్లో అప్‌లోడ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, 12వ తరగతి వరకు చదువుకున్న సిమ్రాన్.. 17 ఏళ్ల క్రితం వివాహం చేసుకొని సూరత్‌లో స్థిరపడింది. అప్పటినుంచి తరచూ రీల్స్, షార్ట్ వీడియోలు పోస్ట్ ఇన్ ఫ్లూయెన్సర్ గా గుర్తింపు పొందారు.

గాంధీపై సిమ్రాన్ చేసిన రీల్ వైరల్ కావడంతో అది కాస్త సామాజిక కార్యకర్త ధర్మేష్ గామి దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన ఈ వీడియోపై సూరత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జాతీయ నాయకుడిని, కరెన్సీ నోటును అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. సిమ్రాన్ ను అదుపులోకి తీసుకున్నారు.

సిమ్రాన్ పటేల్ అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను సూరత్ పోలీసులు తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారు. అందులో ఆమె రీల్ చేసినప్పటి క్లిప్‌తో పాటు.. చేతులకు సంకెళ్లతో ఉన్న దృశ్యాలను ‘బిఫోర్ అండ్ ఆఫ్టర్’ రూపంలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలోనే సదరు ఇన్ ఫ్యూయెన్సర్ క్షమాపణలు చెప్పారు. మరోవైపు ఎవరి భావోద్వేగాలనైనా దెబ్బతీసే విధంగా ఉన్న కంటెంట్‌ను పోస్ట్ చేయవద్దని ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ANN TOP 10