న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) మరోసారి చుక్కెదురైంది. సీబీఐ (CBI) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. సీబీఐ తనను ప్రశ్నించడాన్ని సవాలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్ట్ కొట్టివేసింది. ఇక సీబీఐ కస్టడీకి అప్పగించడానికి సంబంధించిన పిటిషన్‌పై తీర్పును కోర్ట్ రిజర్వ్ చేసింది. దీనిపై కాసేపట్లో తీర్పు వెల్లడయ్యే అవకాశం ఉంది. కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందనేదానిపై ఉత్కంఠ నెలకొంది.








