కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షమ కార్యక్రమాలు, పథకాలు అమల పట్ల ఆకర్షితులై బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన పలువురు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ దుబ్బాక ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ఆధ్వర్యంలో దుబ్బాక నియోజకవర్గంలోని బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన 50 మంది పార్టీలో చేరారు. వారందికి నీలం మధు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తొగుంట ఎంపీపీ గంధారి లత నరేందర్‌రెడ్డి, పార్టీలో చేరిన వారు లింగపూర్ మస్కూరి నర్సింలు, ఓలపు కరుణాకర్, అధ్యక్షుడు కొత్తపల్లి బాను, కొంగరి కరుణాకర్, కొంగరి ప్రదీప్,కొంగారి సంజీవ్, దాసని అశోక్,కొత్తపల్లి రాజు, దాసని మహిపాల్, కొంగరి రామస్వామి, గంగి స్వామి తదితరులు ఉన్నారు.









