AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రైతులను నష్టపరిస్తే సహించేది లేదు: సీఎం రేవంత్ రెడ్డి

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా హెచ్చరించారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వ్యాపారులు, మార్కెట్ అధికారులు కుమ్మక్కై ధాన్యానికి తక్కువ ధర చెల్లిస్తున్నారని రైతులు జనగామ వ్యవసాయ మార్కెట్‌లో ఆందోళనకు దీగారు. జనగామ వ్యవసాయ మార్కెట్‌లో జరిగిన ఘటనపై అధికారులను మందలించారు. రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్‌ను అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్ (ఎక్స్ ) వేదికగా సూచించారు.

ANN TOP 10