AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీ అభ్యర్థి మాధవీలతకు వై ప్లస్ భద్రత

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న మాధవీలతకు భద్రత కల్పించింది. ఈ మేరకు వై ప్లస్ భద్రతను కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ వీఐపీ సెక్యూరిటీలో భాగంగా 11 మంది భద్రత సిబ్బంది పహారా కాస్తారు. ఇందులో ఆరు మంది సీఆర్‌పీఎఫ్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు మాధవీలత వెంట ఉండగా.. ఐదుగురు సెక్యూరిటీలు ఆమె నివాసం వద్ద ఉండనున్నారు. ఎంఐఎం కంచుకోట అయిన హైదరాబాద్ స్థానం నుంచి మాధవీలతను బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. హైదరాబాద్ లోక్ సభ స్థానాన్ని 2004 నుంచి ఆ స్థానంలో ఉన్న మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీని ఓడించి ఆ స్థానం తమ ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఈ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంఐఎం పార్టీ నుంచి అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ నుంచి మాధవీలత, బీజేపీ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ నుంచి పోటీ చేస్తున్నారు. హైదరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.

ANN TOP 10