బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును పోలీసులు ఆదివారం తనిఖీ చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును(Bus) పోలీసులు ఆదివారం తనిఖీ చేశారు. (Police checked) జనగామ,సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించేందుకు ఎర్రవల్లి నుంచి సూర్యాపేట వెళ్తున్నారు. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా ఈదుల పర్రె తండాలో వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద కేసీఆర్ వాహనాన్ని ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు.
ఎన్నికల నిబంధనలను(Election Code) అనుసరించి పోలీసులకు కేసీఆర్ పూర్తిగా సహకరించారు. కేసీఆర్ వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు. తనిఖీకి సహ కరించిన కేసీఆర్‌కు పోలీసులు ధన్యవాదాలు తెలిపారు. తనిఖీ అనంతరం కేసీఆర్ ఎండిన పంటలను పరిశీలించేందుకు వెళ్లారు.









