ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క స్వాగతం పలికారు. అనంతరం ఇందిర ప్రియదర్శిని స్టేడియానికి బయలు దేరారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఉదయం ఆదిలాబాద్‌కు చేరుకొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా స్వాగత కార్యక్రమాలు చేపట్టనున్నారు. దీంతో మోడికి స్వాగతం పలికిన అనంతరం అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. అలాగే మోడీకి స్వాగతం పలికే కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై కూడా పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ తమిళి సై ఆదిలాబాద్‌కు చేరుకోగా మంత్రి సీతక్క ఆమెకు స్వాగతం పలికారు. ఇక అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క, అదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, ఆడే గజేందర్ పరిశీలించారు. ప్రధాని, సీఎం పర్యటన సందర్భంగా పోలీసు అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. 2 వేల పోలీసుల, 300 ఎస్పీజీ బలగాలతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.









