AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అడ్డంగా దొరికిన శామీర్‌పేట తహసీల్దార్‌

రూ.10 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ

అమ్మన్యూస్‌, హైదరాబాద్‌: లంచం తీసుకుంటూ శామీర్‌పేట తహసీల్దార్‌ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. తహసీల్దార్‌ కార్యాలయంలోనే ఓ వ్యక్తి నుంచి మంగళవారం రూ. 10 లక్షలు లంచం తీసుకుంటుండగా తహసీల్దార్‌ సత్యనారాయణను ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంతో పాటు సత్యనారాయణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. పాస్‌బుక్‌ల కోసం రూ.10 లక్షలు లంచం డిమాండ్‌ చేశాడు తహసీల్దార్‌. దీంతో బాధిత వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ వలపన్ని పట్టుకున్నది.

ANN TOP 10