AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కొమురవెల్లి మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం

హైదరాబాద్‌ : భక్తుల కొంగు బంగారం కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి (Mallanna temple) భక్తులు(Devotees)పోటెత్తారు. నాలుగో ఆదివారం సందర్భంగా దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, వేకువ జాము నుంచే కోనేరులో స్నానాలు చేసి, స్వామి వారిని దర్శించుకున్నారు. అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశ ఖండన, గంగరేగు చెట్టువద్ద ముడుపులు చెల్లించుకున్నారు. ఒగ్గు కళాకారుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో ఆలయ ప్రాంగణం హోరెత్తింది.

ANN TOP 10