AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లోక్‌సభ ఎన్నికల తర్వాత ’కారు పార్టీ ఖాళీ’ తప్పదా?

బీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పుతున్న నేతలు
లీడర్లు హస్తం పార్టీలోకి జంప్‌
ఓ పక్క అవిశ్వాసాల జోరు
పార్లమెంట్ ఎన్నికల ముందు వరుస షాక్‌లు
మరి కొందరు నేతలు హస్తం గూటికి రెడీ!

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల వేడి రాజకుంటోంది. ఆ ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధాన పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. రాజకీయాల్లో ఇప్పుడు మైండ్ గేమ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అలాగే ఎవరికి వారు ఎదుటి వారి పని అయిపోయిందని నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ మరో ఆరు నెలలే ఉంటుందని బీఆర్ఎస్, బీజేపీ అంటున్నాయి. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ లేనట్టే అని వారి చేస్తున్న విమర్శలకు కౌంటర్లు ఇస్తుంది. ఈ మూడు పార్టీల రాజకీయం ఆసక్తిగా మారుతుంది. ఇదిలా ఉంటే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చాలా మంది నేతలు పార్టీ ఫిరాయించేందుకు రెడీ అవుతున్నారు. వాళ్లు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు, కీలక నేతలు సీఎం రేవంత్ రెడ్డి‌ని కలుస్తున్నారు. మరికొందరు నేతలు నేరుగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ మెజార్టీ ఎంపీ సీట్లను గెలుచుకుని తమ ప్రతిష్ఠను పెంచుకోవాలని ప్లాన్ చేస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటకపోతే క్యాడర్లో నిరుత్సాహంతో పాటు కొంత ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉంటుందని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఇదంత పక్కన పేడితే లోక్‌సభ ఎన్నికల ముంగిట బీఆర్‌ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తలుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో మండల, జిల్లా పరిషత్‌, మునిసిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాల జోరు కొనసాగుతోంది. దీంతో పాటు కీలక నేతలు సైతం పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. మెన్న స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన కూడా త్వరాలోనే హస్తం గూటికి చేరుకుంటారని ప్రచారం జరుగుతోంది. తాజాగా పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బొర్లకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణు గోపాల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అదే విధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్‌తో పాటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌తో చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఇద్దరు నేతలు పార్టీ మారుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలవడం చర్చనీయాంశంగా మారింది. తాము నియోజకవర్గ అభివృద్ధి పనుల విషయమై సీఎంను కలిశామని ఆ ఎమ్మెల్యేలు క్లారిటీ ఇచ్చారు. ఇక తమతో కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చెప్పాగా.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీఆర్ఎస్‌ను ముక్కలు చేస్తాం.. ఎంపీ ఎన్నికల తర్వాత 30 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని ఖాళీ చేస్తారు అని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విధంగా కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేయడం బీఆర్‌ఎస్‌లో లోక్‌సభ ఎన్నికల తర్వాత ఖాళీ అవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ANN TOP 10