AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ ప్రజలు ఈ నెల విద్యుత్ బిల్లులు కట్టొద్దు.. ఇలా చేయండి: కేటీఆర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. లండన్‌లో రేవంత్ చేసిన కామెంట్స్ సీఎం హోదాకు తగ్గట్టు లేవని చెప్పారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మాట్లాడుతూ… జనవరి నెల విద్యుత్ బిల్లులను ప్రజలు ఎవరూ కట్టొద్దని చెప్పారు. బిల్లులను కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ఇంటికి పంపాలని అన్నారు.

తెలంగాణలోని ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తానని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ఆ హామీని వెంటనే నెరవేర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌ను, బీఆర్ఎస్‌ను వంద మీటర్ల లోతులో బొంద పెడతానని రేవంత్ రెడ్డి అంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేయకపోతే ఆ పార్టీనే ప్రజలు బొంద పెడతారని అన్నారు.

కాంగ్రెస్ ఇచ్చిన హమీలు అమలు చేయడం అసాధ్యమని చెప్పారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ కాదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని చెప్పారు. ఢిల్లీలో ఉండే మోదీది, ఉంటే తెలంగాణలో చోటా మోదీ.. రేవంత్ రెడ్డిది ఒకే వ్యవహార శైలి అని విమర్శించారు. రేవంత్ రెడ్డి మరో ఏక్‌నాథ్ షిండే అవతారం ఎత్తుతారని అన్నారు.

ANN TOP 10