AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన విమానం.. పైల‌ట్ మృతి

చిలీలోని టాల్కా న‌గ‌రంలో ఓ విమానం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో పైల‌ట్ మృతి చెందాడు. మ‌రో న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మృతి చెందిన పైల‌ట్‌ను ఫెర్నాండో సోల‌న్స్ రోబెల్స్‌(58)గా గుర్తించారు.

ప్ర‌మాదానికి గురైన విమానాన్ని ఫైర్‌ఫైట‌ర్ ప్లేన్‌గా గుర్తించారు. ఈ ప్ర‌మాదాన్ని చిలీ వ్య‌వ‌సాయ మంత్రిత్వ శాఖ ధృవీక‌రించింది. మృతి చెందిన పైల‌ట్ నేష‌న‌ల్ ఫారెస్ట్రీ కార్పొరేష‌న్‌లో ప‌ని చేస్తున్నారు. ఈ ఫైర్‌ఫైట‌ర్ విమానం అగ్నిప్ర‌మాదాల‌ను నియంత్రించేందుకు ఉప‌యోగిస్తుంటారు. అయితే ఈ విమానం హైవేపై ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్ట‌డంతో మంట‌లు చెల‌రేగాయి. ఈ ప్ర‌మాదంతో హైవేపై వెళ్తున్న కారు కూడా ప్ర‌మాదానికి గురైంది. దీంతో కారులో వెళ్తున్న న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. విమాన ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.

ANN TOP 10