AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ – ఛ‌త్తీస్‌గ‌ఢ్ స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టుల కాల్పులు

తెలంగాణ – ఛ‌త్తీస్‌గ‌ఢ్ స‌రిహ‌ద్దులోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. పామేడు ప‌రిధిలోని చింత‌వాగు, ధ‌ర్మారం, పామేడు క్యాంపుల‌పై మావోయిస్టులు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ మూడు క్యాంపుల‌పై మావోయిస్టులు ఏక‌కాలంలో కాల్పులు జ‌రిపారు. దీంతో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు అప్ర‌మ‌త్త‌మై మావోయిస్టుల కాల్పుల‌ను తిప్పికొట్టారు. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి ప్రారంభ‌మైన కాల్పులు.. బుధ‌వారం తెల్ల‌వారుజాము వ‌ర‌కు కొన‌సాగాయి. పామేడు ప‌రిస్థితుల‌పై పోలీసులు ఉన్న‌తాధికారులు ఆరా తీశారు. ఈ మూడు క్యాంపుల ప‌రిస‌రాల్లో పోలీసులు భారీగా మోహ‌రించారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ కొన‌సాగిస్తున్నారు.

ANN TOP 10