AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇండోనేషియా దీవుల్లో భారీ భూకంపం.. 6.7 తీవ్రత

జకార్త: ఇండోనేషియాలోని (Indonesia) తలాడ్ దీవుల్లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున 2.18 గంటలకు తలాడ్‌ దీవుల్లో (Talaud Islands) భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదయింది. భూ అంతర్భాగంలో 80 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) వెల్లడించింది. ఫిలిప్పీన్స్‌ (Philippines) తీరంలోని పసిఫిక్‌ మహాసముద్రంలో భూమి కంపించిందని అధికారులు తెలిపారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు.

కొత్త సంవత్సరం రోజున జపాన్‌లో (Japan) 7.6 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసింది. భూకంపం ధాటికి ఇప్పటివరకు 100 మందికిపై మరణించారు. మరో 200కుపైగా మంది ఆచూకీ లభించలేదు.

ANN TOP 10