AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈటల రాజేందర్‌తో విభేదాలు.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

బీజేపీ నేత ఈటల రాజేందర్‌తో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కు విభేధాలున్నాయంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారంపై బండి సంజయ్ స్పందించారు. ఈటలతో తనకు గానీ.. పార్టీలో ఎవరితో గానీ విభేదాలు లేవని బండి సంజయ్ స్పష్టం చేశారు. అందరం కలిసే ఉన్నామని.. ఈ వార్తలను కార్యకర్తలు నమ్మొద్దని సూచించారు. అయితే.. ఎన్నికల ముందు నుంచే ఈ వార్తలు ప్రచారంలో ఉండగా.. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి ఊపందుకున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో ఈటల రాజేందర్ పోటీ విషయమై.. పార్టీలో మరోసారి విభేదాలు తలెత్తినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

లోక్ సభ ఎన్నికల్లో ఈటల రాజేందర్‌.. కరీనంగర్ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారని, కానీ అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఉండటం వల్ల సాధ్యం కానీ విషయమని తెలుస్తోంది. అయితే.. ప్రతిగా ఆయన మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. కానీ.. అధిష్ఠానం మాత్రం ఆయనను మెదక్ స్థానం నుంచి బరిలో దింపాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ కూడా.. రఘునందన్ రావు పోటీకి ఆసక్తి చూపిస్తుండటంతో.. ఇప్పుడు ఈటల ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఉత్కంఠగా మారింది. దీంతో.. ఈటల కొంత అసంతృప్తిగా ఉన్నారని.. ఒకానొక పరిస్థితిలో పార్టీ కూడా మారే ఛాన్స్ కూడా ఉందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ANN TOP 10